ఇండ్ల నిర్మాణ సామాగ్రి ధరల నియంత్రణకు పకడ్బందీ చర్యలు : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

ఇండ్ల నిర్మాణ సామాగ్రి ధరల నియంత్రణకు పకడ్బందీ చర్యలు : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇసుక, మోరం కేటాయింపు

ట్రాక్టర్ ఇసుక రవాణాకు 1500 రూపాయలు మించి చెల్లించవద్దు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ సామాగ్రి ధరల నియంత్రణ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల, జూలై 14:- ఇండ్ల నిర్మాణ సామాగ్రి ధరల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ సామాగ్రి ధరల నియంత్రణ పై ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్, కంకర, ఇటుక ధరలు పెరగకుండా నియంత్రించాలని అన్నారు.ఇసుక సమస్య లబ్దిదారులకు రాకుండా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుందని అన్నారు.  

వార్తా పత్రికలో ఇసుక 6 వేలకు అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయని, దీని పై మండల స్థాయిలో తహసిల్దార్ లు దృష్టి సారించాలని,లబ్దిదారుల పై రవాణా ఖర్చు మినహా ఇసుక కొనుగోలు నిమిత్తం ఎటువంటి భారం పడటానికి వీలు లేదని అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల వద్ద అధిక ధరలకు ఇసుక ఎవరు విక్రయిస్తున్నారో విచారించాలని అన్నారు. 

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక అక్రమ రవాణా జర్గకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రతి మండలంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి 1500 కంటే ఎక్కువ ట్రాక్టర్ ఇసుక రవాణా కోసం తీసుకుంటే సమాచారం అందించాలని, అటువంటి వారి వారి పై పోలీస్ కేస్ నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. 

ఇంటి నిర్మాణానికి మోరం ఎంత అవసరం అవుతుందో పక్కా లెక్కలు వేయాలని అన్నారు. సిరిసిల్ల, వేములవాడ లో మోరం అక్రమ రవాణా జర్గకుండా చూడాలని అన్నారు.నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇసుక, మోరం కేటాయింపు చేయాలని అన్నారు.

మండల అధికారులు సెలవు రోజుల్లో హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండాలని , ఏదైనా వ్యక్తిగత పని పై ఉండలేకపోతే ప్రత్యామ్నాయ అధికారి అందుబాటులో ఉంచాలని అన్నారు. రైతులు లబ్దిదారుల ఉంటే వారి ట్రాక్టర్ లను కూడా ఉపయోగించి ఇసుక తీసుకుని వెళ్ళవచ్చని అన్నారు. 

ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఇసుక, మోరం తరలింపు అనుమతుల మేరకు మాత్రమే జరగాలని, అనుమతి పత్రాలు లేనిది జర్గడానికి వీలు లేదని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట అక్రమ రవాణా జరగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా నోటి మాట తో ఇసుక, మోరం తరలించడానికి వీలు లేదని, సరియైన అనుమతి పత్రాలతో మాత్రమే రవాణా చేయాలని లేనియెడల అట్టి వాహనాలను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. 

ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, పీడీ హౌసింగ్ శంకర్, జెడ్పీ సి.ఈ.ఓ. వినోద్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసిల్దార్ లు, సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.

Post a Comment

Previous Post Next Post