ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన ఎన్నికల సంఘం కమిషనర్
హాజరైన కలెక్టర్ హరిత, ఎస్పీ మహేష్ బి గితే
-----------------------------
రాజన్న సిరిసిల్ల, 29 సెప్టెంబర్ 2025:
------------------------------
ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు.
సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు . సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హరిత, ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎంపిటిసి, జడ్పిటిసి , గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని వెల్లడించారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల జరిగిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వెంటనే ఎన్నికలు జరిగే గ్రామీణ ప్రాంతాలలో అమలు లోకి రావడం జరుగుతుందని అన్నారు. ఎం.సి.సి నిబంధనల ప్రకారం 24 గంటలు, 48 గంటలు, 72 గంటల లోపు తీసుకోవాల్సిన చర్యలను చేపట్టే రిపోర్ట్ అందించాలని అన్నారు. బ్యాలెట్ బాక్స్, పోలింగ్ పర్సనల్ ట్రైనింగ్స్ సరిపోయేంత మెటీరియల్ అన్ని సరిగా చూసుకోవాలని సూచించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్,
జడ్పీ సీఈఓ వినోద్ కుమార్, డీపీఓ షర్ఫుద్దీన్, జడ్పీ డిప్యూటీ సీఈఓ గీత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.