ఈనాడు అధినేత రామోజీరావు కన్నుమూత

హైదరాబాద్, 08 జూన్: ఈనాడు అధినేత రామోజీరావు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. వయసు మీద పడటంతో తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నానక్ గూడలోని స్టార్ హాస్పిటల్ కు తరలించారు.

వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు ఆయన కన్నుమూశారు.

ప్రస్తుతం రామోజీరావు వయస్సు 87 ఏళ్లు. వ్యాపార దిగ్గజంగా ఆయనకు గొప్ప పేరుంది. మీడియాతో పాటు అనేక వ్యాపారాల్లో రాటుదేలారు రామోజీరావు. ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌, ప్రియా ఫుడ్స్‌ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేగాక రామోజీ ఫిల్మ్‌ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్, సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు రామోజీరావు.

Post a Comment

Previous Post Next Post