హైదరాబాద్: తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఫాజిల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్‌లో ఫాజిల్ సూసైడ్ చేసుకున్నారు. కూతురితో మాట్లాడిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. ఫాజిల్ బలవన్మరణానికి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులా? కుటుంబ కలహాలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య
byJanavisiontv
-
0