ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో మేరకు సిరిసిల్ల పట్టణంలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ...
రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలందరికీ పోలీసులు ఎల్లవేళలా తోడుంటారని ధైర్యాన్ని కల్పించడానికి సిరిసిల్ల పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ నుండి సుభాష్ నగర్, నెహ్రు నగర్, కొత్త బస్టాండ్, గాంధీ నగర్,గోపాల్ నగర్ చౌరస్తా, శివ నగర్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు బిఎస్ఎఫ్ బలగాలు మరియు జిల్లా పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ ఎన్నికలను శాంతియుత వాతావరణం లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా జిల్లాలో ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించనున్నారు. ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు కీలకపాత్రను పోషిస్తాయని ప్రతి సమస్యఆత్మ పోలింగ్ కేంద్రాల నందు సాయుద బలగాలతో కూడిన బిఎస్ఎఫ్ సిబ్బంది విధులను నిర్వహిస్తుంటారని అదనపు ఎస్పీ తెలిపారు.
ఈ ఫ్లాగ్ మార్చ్ లో టౌన్ సి.ఐ ఉపేందర్, ఎస్.ఐ లు ప్రేమనందం, రాజు, BSF సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.