గగన్యోన్ మిషన్లో కీలకమైన TV-01 వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 8.45 గంటలకు సాంకేతిక లోపంతో ఈ ప్రయోగం నిలిచిపోగా.. అనంతరం లోపాన్ని సరిదిద్దిన శాస్త్రవేత్తలు రాకెట్ను విజయవంతంగా నింగిలోకి పంపారు. ఈ ప్రయోగం 8 నిమిషాల్లో పూర్తి కానుంది.
గగన్ యాన్ మిషన్ లో తొలి ప్రయోగం సక్సెస్
గగన్మోన్ మిషన్లో భాగంగా ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతం అయింది. ఉ.10కి TV-D1 వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లగా 60.6 సెకన్లకు టెక్నికల్ వెహికల్ నుంచి క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం విడిపోయింది. 90.6 సెకన్లకు క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం నుంచి క్రూ మాడ్యూల్ బయటికి వచ్చింది. అనంతరం వివిధ దశల్లో పారాచూట్ విచ్చుకొని 531.8 సెకన్ల వద్ద మెయిన్ పారాచూట్ సాయంతో క్రూమాడ్యూల్ బంగాళాఖాతంలో దిగింది.
Tags
శ్రీహరికోట