తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

హైదరాబాద్:అక్టోబర్ 22
తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ప్రజల జీవన విధానం లోనుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అన్నారు. దేవీదేవతలను అర్చించే పువ్వులే బతుకమ్మగా పూజలందుకోవడం తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధనను, కృతజ్ఞతాభావనను తెలియజేస్తుందన్నారు.

సబ్బండ వర్గాలు సమిష్టిగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. పచ్చదనం, పాడి పంటలు, పశుసంపద, ప్రకృతి వనరుల సమృద్ధితో నేడు తెలంగాణ రాష్ట్రం నిండైన బతుకమ్మను తలపిస్తున్నదని చెప్పారు.

బతుకమ్మల నిమజ్జన సమయంలో స్వీయ జాగ్రత్తలతో పాటు, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆనందోత్సాహాలతో సద్దుల బతుకమ్మను పండుగను జరుపుకోవాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలనీ జగన్మాత గౌరీదేవిని ఈ సందర్భంగా ప్రార్థించారు.

Post a Comment

Previous Post Next Post