బిజెపి టికెట్ల కేటాయింపుతో రాజీనామా పర్వం.. రాజీనామా ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరు రమాకాంత్ రావు..


సిరిసిల్ల, 24 అక్టోబర్ (జన విజన్ న్యూస్):
 న్యూస్): స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వకుండా, ఏకపక్ష నిర్ణయంతో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడంతోనే తాను రాజీనామా చేస్తున్నానని అన్నారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి రమకాంతరావు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్ల సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసి రమాకాంత్ రావు తన నిర్ణయాన్ని వెల్లడించారు. స్థానికంగా ఉన్న సమస్యలపై పోరాడిన నాయకులను వదిలేసి స్థానికేతరులకు సిరిసిల్ల బిజెపి టికెట్ కేటాయించడం పట్ల ఆవేదనతో మాట్లాడుతున్నానని అన్నారు. నిస్వార్థంతో పార్టీ పటిష్టం కోసం శ్రమించానని, నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నానని అన్నారు. లక్షలు సంపాదించే వృత్తిని వదులుకొని, నాలుగున్నర సంవత్సరాల క్రితం పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరానని అన్నారు. స్థానికంగా ఉన్న జిల్ల నాయకుడు తనను నమ్మకద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బయట కనిపించే బిజెపి పార్టీ వేరు, లోపల కనిపించే బిజెపి పార్టీ వేరని అన్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా పార్టీ పరిష్కారం కోసం స్థానికులం పని చేస్తే, స్థానికులను సంప్రదించకుండా, సమన్వయం చేయకుండా, స్థానిక సమస్యలపై అవగాహన లేని నర్సంపేటకు సంబంధించిన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం తమ మనోభావాలను దెబ్బతీయటమేనని రమాకాంత్ రావు అన్నారు. స్థానిక నాయకులకు ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేసుకునే వారిమని, స్థానికేతరురాలికి టికెట్ ఇవ్వడం పట్ల ఆవేదనతో రాజీనామా చేస్తున్నానని అన్నారు. తను నమ్మిన జిల్ల నాయకుడే తనకు ద్రోహం చేసే విధంగా ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థిని సిరిసిల్ల అభ్యర్థిత్వానికి ప్రోత్సహించినట్లు తెలిపారు. రాజకీయంలో నమ్మకమే ప్రధాన అంశమని, తనను నమ్మించి మోసం చేశారని విచారం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే తన లక్ష్యం బిజెపిలో నెరవేరదనే ఉద్దేశంతో రాజీనామాకు సిద్ధమైనట్లు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post