తెలంగాణ హైకోర్టు లా సెక్రటరీ తిరుపతి కుటుంబ సమేతంగా మంగళవారం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం ఇచ్చారు. వారికి ఆలయ పర్యవేక్షకులు అలీ శంకర్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, పోసాని రాజు ప్రసాదాలు అందజేశారు.
Tags
vemulawada