రేపు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా

రేపు కాంగ్రెస్ 58 మంది అభ్యర్థులతో కూడిన మొదటి లిస్టు విడుదల

Input Editor Dayanand Jana
ఢిల్లీ,14 అక్టోబర్ (జనవిజన్ న్యూస్): తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా పై ఆ పార్టీ స్ర్కీనింగ్ కమిటీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈరోజు స్ర్కీనింగ్ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాపై కసరత్తు చేశారు. తొలి జాబితాలో 58 స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం. అభ్యర్థులను ప్రకటించనున్నది. రేపు కాంగ్రెస్ అధిష్ఠానం మిగతా రాష్ట్రాలతో పాటు తెలంగాణ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తుంది.

అది మా అంతర్గత విషయం.. మురళీధరన్

అభ్యర్థుల తుది జాబితా గురించి తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ..‘‘ సీపీఎం - సీపీఐ పార్టీలతో పొత్తులపై చర్చలు తుది దశలో ఉన్నాయి. రేపు పొత్తులపై స్పష్టత వస్తుంది. గెలుపు అవకాశాలు, పార్టీకి విధేయులను అభ్యర్థులుగా ఎంపిక చేశాం. పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లడం మా అంతర్గత విషయం. అన్ని సామాజిక వర్గాలకు సీట్ల కేటాయింపు ఉంటుంది. 119 స్థానాల్లో మెజారిటీ పార్టీ నేతలకు సీట్ల కేటాయింపు ఉంటుంది. రేపు కాంగ్రెస్ 58 మంది అభ్యర్థులతో కూడిన మొదటి లిస్టును విడుదల చేస్తాం. మరో రెండు రోజుల్లో ఇతర అభ్యర్థులకు సంబంధించిన లిస్టును విడుదల చేస్తాం. సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తాం’’ అని మురళీధరన్ పేర్కొన్నారు.

Post a Comment

Previous Post Next Post