Editor Dayanand Jana
వేములవాడ, 16 అక్టోబర్(జనవిజన్ న్యూస్): వేములవాడ పట్టణంలోని హరిమల గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ వేములవాడ MLA అభ్యర్థి అది శ్రీనివాస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోసారి తనకు ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. నవంబర్ 30 నాడు జరిగే ఎన్నికలో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. తెలంగాణ సమస్యలు ఎక్కడికక్కడే ఉండగా తెరాస నుండి బిఅర్ఎస్ గా మార్చడం రాజకీయమేనని అన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు, కోసం తెలంగాణ తెచ్చుకున్నామని అన్నారు. అధికార పార్టి దళితులకు మూడు ఎకరాలు భూమి ఇవ్వలేదు, దళిత బందు, బి సి బందు, కేజీ టు పిజి ఇవ్వలేదని ఆరోపించారు. రైతు రుణమాఫీ చేయలేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఆన్యాయం జరిగిన పట్టించుకోలేదని దుయ్యబట్టారు. డబుల్ బెడ్ రూం ల పేరిట ప్రజలను మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ లు పూర్తిగా పేద ప్రజల కోసమేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతామని స్పష్టం చేసారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన బిఅర్ఎస్ మెనిఫెక్టో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ది కాఫీ కొట్టాడని అన్నారు. 10 ఏళ్ల లో బిఅర్ఎస్ పార్టీ ఎందుకు సిలెండర్ 1200 చొప్పున వసూలు చేశారని ప్రశ్నించారు. అడ్డదారుల్లో అధికారంలోకి రావడానికి మాత్రమే మేనిఫెస్టో విడుదల చేసారని అన్నారు. గతంలో కేసీఆర్ మెనిఫెస్టోలో పెట్టిన పథకాలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదన్నారు. వేములవాడ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు. వేములవాడలో మూడు నెలల ముందు వచ్చిన వ్యక్తి కావాలా.. 20 ఏళ్లుగా గెలిచినా, ఓడినా మీ మధ్యలో ఉన్నానని అన్నారు. కార్పొరేట్ శక్తులను నమ్మొద్దని సూచించారు. మీ కార్పొరేట్ దవాఖానలు 20 ఏళ్ల క్రితం పెడితే ఇన్నాళ్లు వేములవాడ నియోజక వర్గ ప్రజలు కనబడలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికే పరాయి దేశ వ్యక్తి పాలన వలన ఏళ్లుగా తీవ్రంగా నష్టపోయామని, మళ్లీ అవకాశము కోసం వలస వచ్చే నాయకుడి నీ నమ్మవద్దని కోరారు. వాళ్ళు అవసరం తీరాక వెళ్లిపోతారు, కానీ నేను మీ మధ్య లోనే ఉంటానని భరోసా ఇచ్చారు. వేములవాడ నియోజకవర్గం అనేకమైన సమస్యల వలయంలో చిక్కుకుందని తెలిపారు. ఇన్ని ఏళ్లలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేవలం రంగుల రంగుల బ్రోచర్లకే ఆలయ అభివృద్ధి పరిమితం అయిందని అన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు డబుల్ బెడ్ రూం నిర్మాణాల కోసం 5 లక్షల 4 వేలు ఇస్తానని మోసం చేశారని గుర్తు చేసారు. మేడిపల్లి, భీమారం మండలం నుండి వేములవాడ నియోజకవర్గానికి దారి లేదని అన్నారు. ఎన్నికల వేళ, ఎన్నికల కోసం మాత్రమే తాత్కాలిక జీవో చూపిస్తూ మోసం చేయడానికి వచ్చేవాళ్లను నమ్మవద్దని అన్నారు. మంత్రి కెటిఆర్ ఎన్నికల వేళా ఎక్కడికి వెళ్తే అక్కడే కోనసీమగా మరుస్తా అని చెప్పడం అలవాటు అయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాజన్న ఆలయం ను పర్యాటక కేంద్రంగా మారుస్తామని అన్నారు. వెనకబడిన వేములవాడను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి ఒక్కసారి అవకాశము ఇవ్వాలని కోరారు. ఏమైనా అంటే అది శ్రీనివాస్ పక్కన ఉన్న వ్యక్తులు అందరూ ఎమ్మెల్యేలు అవుతారు అని తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. అధికార పార్టీ అభ్యర్థి ప్రలోభపెట్టే డబ్బుల కోసం లొంగవద్దు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేములవాడ పట్టణ, అర్బన్, రూరల్, చందుర్తి అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, వకులాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, చింతపండు రామస్వామి, జెడ్పిటిసి నాగం కుమార్, కాయతి నాగరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, అజీమ్, నాయకులు సంఘ స్వామి యాదవ్, చిలుక రమేష్, కూరగాయల కొమురయ్య, తుమ్మ మధు, కనికరపు రాకేష్, కొలకాని రాజు, మూల కిషోర్, గుర్రం తిరుపతి, సుగురి సుధాకర్, పిట్టల గంగాధర్, నాగుల రాము, నేరెళ్ల శ్రీధర్, లింగంపల్లి కిరణ్, నీలం గురవయ్య, వస్తాదు కృష్ణ, ఖమ్మం గణేష్, తదితరులు ఉన్నారు.
Tags
vemulawada