ఎన్నికల ఫిర్యాదుల పై తక్షణమే స్పందించాలి: జిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి


సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం, ఎంసిఎంసీ, మీడియా సెంటర్ ను తనిఖీ చేసిన  కలెక్టర్ అనురాగ్ జయంతి
 

 ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదుల ఉన్న కంట్రోల్ రూం నెంబర్  08723293024 ఫోన్ చేసి చెప్పండి: కలెక్టర్

సిరిసిల్ల 18, అక్టోబర్ 2023: నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల ఫిర్యాదుల పై వేగంగా స్పందించాలనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి  అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం గ్రౌండ్ ఫ్లోర్ లో 24 గంటలు పని చేసే సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం, ఎంసిఎంసీ , మీడియా సెంటర్ ల ను  కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ తో తనిఖీ చేశారు. సి - విజిల్, కంట్రోల్ రూం, 1950 , సోషల్ మీడియా ఫిర్యాదుల నమోదును పరిశీలించారు.

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు నిస్వాక్షపాతంగా స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో జరగడంలో సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం, ఎంసిఎంసీ , మీడియా సెంటర్ కీలక పాత్ర అన్నారు.

ఎన్నికలలలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా.. మీడియా లో ఫేక్ న్యూస్ ప్రసారమైన, ఓటర్లు ఏదైనా సందేహాల నివృత్తి కి, సమాచారం కోసం సంప్రదించిన వెంటనే స్పందించాలని చెప్పారు. 

ఎన్నికల ఫిర్యాదుల ఉంటే ప్రజలు కంట్రోల్ రూం నెంబర్  08723293024 ఫోన్ చేసి చెప్పవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.

కార్యక్రమంలో డిపిఆర్ఓ మామిండ్ల దశరథం , జిల్లా కార్మిక అధికారి రఫీ, ఎస్సీ కార్పొరేషన్ లిమిటెడ్ కార్య నిర్వాహక సంచాలకులు డాక్టర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post