రాజన్న సిరిసిల్ల జిల్ల, 18 అక్టోబర్ (జన విజన్ న్యూస్): రానున్న శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ నుంచి సిరిసిల్ల అభ్యర్థిగా తాను బరిలో ఉంటున్నానని తెలిపారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము. బుధవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో స్థానిక నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాము మాట్లాడారు.
స్థానికుడిని, బీసీ బిడ్డను, జిల్లా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన తనకు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు రానున్న ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలపాలని వైఎస్ఆర్టిపి జిల్లా అధ్యక్షుడు, సిరిసిల్ల నియోజకవర్గ వైఎస్ ఆర్టిపి అభ్యర్థి చొక్కాల రాము కోరారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల సిరిసిల్ల అభ్యర్థిగా తనకు సిరిసిల్ల అసెంబ్లీ టికెట్ కేటాయించారని తెలిపారు. స్థానికుడిగా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతున్న తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. ముదిరాజ్ సామాజిక వర్గంకు చెందిన తనకు టికెట్ కేటాయించిన తమ పార్టీ అధినేత్రి షర్మిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ తనకు మద్దతు తెలపాలని కోరారు. సమావేశంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు మ్యాన లక్ష్మీనారాయణ, రాజన్న సిరిసిల్ల బీసీ సెల్ జిల్ల అధ్యక్షులు వంగరి అనిల్, తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు పురమాని కరుణాకర్ రెడ్డి, వేములవాడ మండల అద్యక్షులు జింక ఎల్లయ్య, రాచర్ల రాజు, గూడెల్లి రాజు, ఎం శంకర్ తదితరులు పాల్గొన్నారు.