తిరుపతి,14 అక్టోబర్ (జనవిజన్ న్యూస్):
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానం అంకురార్పణ చేశారు.నేటి నుంచి ఈనెల 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఈనెల 19న సాయంత్రం 6:30కు శ్రీవారి గరుడోత్సవం జరగనుంది. ఇవాళ్టి నుంచి ఈనెల 23 వరకు శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
శుక్రవారం నుండి శనివారం వరకు సర్వదర్శనాలను రద్దు చేయడం జరిగింది. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.