ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు, సిబ్బందికి జిల్ల ఎస్పీ సూచన
గ్రామాల్లో, పట్టణాల్లో ఆశ్చర్యకరమైన డైనమిక్ తనిఖీలు
అక్రమ నగదు, మధ్యం, మాధకద్రవ్యాలు, ప్రలోభ పరిచే వస్తువులు సరఫరా కాకుండా పటిష్ట నిఘా: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
Input Editor Dayanand Jana
హైదరాబాద్,14 అక్టోబర్ (జనవిజన్ న్యూస్):
ఎన్నికల ప్రవర్తన నియమావలి అమలులో ఉన్నందున శనివారం సాయంత్రం బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగపూర్ చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి, చెస్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, అధికారులకు జిల్ల ఎస్పీ పలు సూచనలు చేసారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ....
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి మద్యం, నగదు, మాధకద్రవ్యలు, ప్రలోబపరిచే వస్తువులు సరఫరా కాకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో ఐదు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, చెక్ పోస్టుల వద్ద నియోజక వర్గంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా పోలీసు బృందాలు ముఖ్యమైన జంక్షన్లు, నియోజకవర్గంలోకి ప్రవేశించే ప్రదేశాలలో ఆశ్చర్యకరమైన డైనమిక్ తనిఖీలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎన్నికల నిబందనలు పాటించాలని సూచించారు. తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా 50 వేల కంటే ఎక్కువ అమౌంట్ తీసుకువెళ్లినట్లయితే సీజ్ చేయడం జరుగుతుందిని ఎస్పీ తెలిపారు. అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు డబ్బులను తీసుకెళ్తున్న వారు సరైన పత్రాలతో డబ్బులు తీసుకెళ్లాలని సూచించారు. నగదుకు సంబంధించిన తగిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంటే ఉంచుకోవడం ఉత్తమమని అన్నారు. ఎన్నికల నియమావలిని అందరూ పాటిస్తూ వాహనాల తనిఖీలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, ఎస్.ఐ మహేందర్ సిబ్బంది పాల్గొన్నారు.