16 నుంచి తెలంగాణలో ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు

Input Editor Dayanand Jana
హైదరాబాద్‌,14 అక్టోబర్ (జనవిజన్ న్యూస్):
ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ సార్వత్రిక ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 16 నుంచి 26 వరకు జరగనున్నాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ స్టడీసెంటర్‌లో హాల్‌ టికెట్లు పొందవల్సిందిగావిద్యాశాఖ తెలిపింది,లేదంటే అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్ల‌డించింది.

పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సంబంధిత పరీక్ష కేంద్రాల్లో జరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు..

Post a Comment

Previous Post Next Post