ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలి
నవంబర్ 01 సా. 4 గం.ల నుండి జరిగనున్న వేడుకలు
పోస్టర్ ఆవిష్కరించిన ప్రతినిధులు
రాజన్నసిరిసిల్ల 06 అక్టోబర్: తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ(జాన పద పరిశ్రమ) ఆధ్వర్యంలో నవంబర్ 1న జరిగే కళాకారులతో జానపద జాతరను విజయవంతం చేయాలని తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షులు పత్తిపాటి రమణాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి సత్తార్, ప్రధాన సలహాదారులు దరువు అంజన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి ఎల్ నాందేవ్, కళాంజలి రాజేష్, రాష్ట్ర కోశాధికారి గజ్వేల్ ఎర్రం వేణు పిలుపునిచ్చారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో నవంబర్ 1న జరిగే జానపద కళాకారుల జాతర పోస్టర్ ను సిరిసిల్ల బివై నగర్ షాధిఖాన లోఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నవంబరు 1న సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ సభ్యుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వివిధ రకాల జానపద కళాకారులు హాజరుకావాలని పేర్కొన్నారు. తెలంగాణలోని పలువురు రాష్ట్ర మంత్రులు, రాష్ట్రంలోని ప్రముఖ కళాకారులు, టెక్నీషియన్లు, మ్యూజిక్ డైరెక్టర్ లను, నటీనటులు, డాన్సర్లతో కలిసి ఫోక్ నైట్ నిర్వస్తున్నామని తెలిపారు. తెలంగాణలో పోక్ ఇండస్ట్రీ సభ్యులు పాడిన జానపద పాటలు నేడు వెండితెర సినిమా తరహాలో ఉంటున్నాయని, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ తరహాలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీని కూడా గుర్తించి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ పోక్ ఇండస్ట్రీలో చాలా మంది గత 30 ఏళ్లుగా జానపద కలలు నమ్ముకొని కళాకారులు జీవిస్తున్నారని, కళాకారులకు ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించాలని అన్నారు. గత కొంతకాలంగా తెలంగాణ పోక్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నవంబర్ 01 సిరిసిల్లలో ఆవిర్భావ సభ అనంతరం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోక్ ఇండస్ట్రీ రాష్ట్ర కమిటీ సభ్యులు, కళాకారులు ఎడమల శ్రీధర్ రెడ్డి, జడల రమేష్, ఆకునూరి దేవయ్య, మాట్ల తిరుపతి, శ్రీరాముల రామచంద్రం, నక్క శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.