సిరిసిల్లలో ఈనెల 26న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం

సిరిసిల్లలో ఈనెల 26న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం

అధికారులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించిన ఆలయ కమిటీ


రాజన్నసిరిసిల్ల 07 అక్టోబర్ 2026: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సమన్వయ సమావేశాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. 2026 -2027 శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవములు తేదీ 17-10-2026 నుంచి 27-10-2026 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల పోస్టర్లను అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులకు సూచనలు చేశారు. 

సమావేశంలో ఆర్డీఓ శ్రీధర్ బాబు, ఆలయ ఈఓ వెంకట మారుతి రావు, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, వికాస తరంగణి సభ్యులు, సత్య సాయి సేవ సమితి సభ్యులు, దేవాలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post