నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అభివృద్ధి కార్యక్రమాల వివరాలు

నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

ముఖ్యమంత్రి సిరిసిల్ల కార్యక్రమాల వివరాలు 

సాయంత్రం 4.45 గంటలకు కరీంనగర్ నుంచి సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల హెలిప్యాడ్‌కు చేరుకోనున్న సీఎం.

సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుంచి ఫూలే, నేతన్న విగ్రహాల మీదుగా రంగినేని ట్రస్ట్ పక్కన ఉన్న బహిరంగ సభా వేదిక వరకు పాదయాత్ర.

సభా వేదిక వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం.

అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి.

సభ అనంతరం రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు సీఎం.

..............

సిరిసిల్లలో మొత్తం రూ.345.78 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి.

సిరిసిల్లలో నేతన్న బజార్‌కు శంకుస్థాపన.

సిరిసిల్లతో పాటు వేములవాడలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన.

సిరిసిల్ల, కోనరావుపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు శంకుస్థాపన.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.99.40 కోట్ల పనులకు శంకుస్థాపన.

సిరిసిల్ల, వేములవాడలో రెండు ఆర్డీవో కార్యాలయాలు, తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగిలో నాలుగు తహసీల్దార్ కార్యాలయాలు, వేములవాడలో సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన.

రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు, అనుబంధ యూనిట్ల నిర్మాణానికి శ్రీకారం.

సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరులో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన్ ప్రారంభోత్సవం.

వేములవాడలో మహిళా పోలీస్ స్టేషన్, వేములవాడ, సిరిసిల్లలో రెండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన.

Post a Comment

Previous Post Next Post