రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను వెంటనే రద్దు పరచలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ హల్డానిలో కొద్దిరోజుల క్రితం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించిన వేదికను గంగాజలంతో శుద్ధిచేసిన బిజెపి, ఆర్ఎస్ఎస్ నాయకులను వెంటనే అరెస్టు చేసి వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని డిమాండ్ చేసిన లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బిజెపి ప్రభుత్వం పై నిరసన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వివిధ మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు మాట్లాడారు. ఈకార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుడుది రాజేందర్, గజ్జల రాజు, మునిగల రాజు, నిమ్మల తిరుపతి గౌడ్, భూక్య సంతోష్, పరశురాం గౌడ్, మానుక సత్యం, సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, మున్సిపల్ కౌన్సిలర్లు బొద్దుల శ్రీనివాస్, గంగరాజు, వెంగళ లీలా లక్ష్మీనరసయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాట నరసయ్య, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాగుల జగన్, గిరిధర్ రెడ్డి, వార్డు అధ్యక్షులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ పై కేసు నమోదును నిరసిస్తూ డిసిసి ఆధ్వర్యంలో ధర్నా
byJanavisiontv
-
0