వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసే వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు వారి విజ్ఞప్తి

 వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసే వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు వారి విజ్ఞప్తి



1. భద్రత, బందోబస్తు కొరకే గణేష్ ఆన్లైన్ నమోదు విధానం. గణేష్ మండప నిర్వాహకులు పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేసుకుని పోలీసు వారికి సహకరించాలి.

2. గణేష్ మండపాలను ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లడానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.

3. మండపాలు ఏర్పాటు చేసేవారు సంబంధిత శాఖల అనుమతి, విద్యుత్ శాఖ వారి అనుమతి పత్రంతోనే విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలి.

4. మండపాలకు పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదే, ప్రతి మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. 

5. గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు ఫోన్ నెంబర్లు మండపంలో ఏర్పాటు చేయాలి.

6. గణేష్ మండపంలో 24 గంటలు 4గురు  వాలంటరీ ఉండే విధంగా నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలి. 

7. గణేష్ ప్రతిమలు కూర్చోబెట్టే ప్రదేశంలో షెడ్డు నిర్మాణం మంచి నాణ్యతతో ఏర్పాటు చేసుకోవాలి, షార్ట్ సర్క్యూట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

8. మండపాల వద్ద అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తతో, fire extinguisher డ్రమ్ముల్లో నీరు, ఇసుకను ఏర్పాటు చేసుకోవాలి. 

9. గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శన దృష్టిలో ఉంచుకొని భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటరీలను నియమించాలి.

10. మండపాల్లో మరియు శోభాయాత్రలో ఎట్టి పరిస్థితుల్లో డీజే లను ఏర్పాటు చేయరాదు.

11. విద్యాసంస్థలకు, హాస్పిటల్స్ కు, ప్రార్థన మందిరాలకు, వృద్ధులకు, చిన్న పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే చిన్న స్పీకర్లను పోలీస్ శాఖ వారి అనుమతితో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. మండపాల వద్ద భక్తి గీతాలు మాత్రమే ప్లే చేయాలి

12. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. 

13. గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, జూదం ఆడడం, అసభ్యకరమైన నృత్యాలు ఏర్పాటు చేయడం, ఇతరులను కించపరిచే విధంగా ప్రసంగాలు, పాటలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధం.

14. ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా మండపాల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం పూర్తిగ నిషేధం.

15. మండపాల్లో ఏదైనా అనుమానాస్పద బ్యాగులు,  వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లయితే తక్షణమే డయల్ 112, లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.

16. మండపాల వద్ద నిర్వహించే  సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమలు  నిర్వహించేటప్పుడు పోలీసు వారికి ముందుగానే తెలియపరచాలి. తద్వారా  మండపాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా పోలీస్ శాఖ చూసుకోవడం జరుగుతుంది.

17. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన రోజున నిర్దిష్ట సమయానికి విగ్రహాలను మండపానికి చేరుకునే విధంగా నిర్వాహకులు చూసుకోవాలి.

18. మధ్యాహ్నం నుండే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభించి నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తయ్యే విధంగా మండప నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి.

19. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన రోజున మరియు నిమజ్జనం రోజున నిర్వాహకులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలిగించకుండా శోభాయాత్రను నిర్వహించుకోవాలి.

20. గణేష్ శోభాయాత్ర సమయంలో ఇతరులపై రంగులు చల్లడం చేయకూడదు.

21. శోభయాత్ర సమయంలో ఇతరులను కించపరిచే విధంగా స్లొగన్స్ చేయకూడదు. 

22. శోభయాత్ర సమయంలో టపాసులు పేల్చడం  పూర్తిగా నిషేధం.

23. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎలాంటి రుమర్స్, వదంతులు నమ్మకూడదు ఎలాంటి సందేహం ఉన్న సంబంధిత పోలీసు వారికి లేదా డయల్ 112 కి సమాచారం అందించాలి.

24. మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చే పోలీస్ శాఖ గణేష్ మండపల వద్ద, శోభాయాత్రలో  మహిళలకు, పిల్లలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.

25. గణేష్  శోభాయాత్రకు ఉపయోగించే వాహనాలను సరైన కండిషన్లో ఉండాలి , అదేవిధంగా డ్రైవర్ కు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహనం సంబంధించిన పేపర్స్ ఉండాలి.

26. మద్యం సేవించి శోభాయాత్రలో ఎట్టి పరిస్థితిలో పాల్గొనరాదు. 

27. గణేష్ మండపాలో పాయింట్ బుక్స్ ను ఏర్పాటు చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం, రాత్రి సమయాల్లో పోలీస్ శాఖ వారు మండపాలను పర్యవేక్షిస్తారు వారికి సహకరించాలి.

28. పోలీసు వారు సూచించిన పై నియమాలను మరియు నిబంధనలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరగడానికి పోలీసు వారికి సహకరించవలసిందిగా మనవి.

Post a Comment

Previous Post Next Post