రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన (పార్ట్ టైమ్) ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా పనిచేయడానికి అర్హత కలిగి ఇంగ్లిష్ మీడియంలో బోధించగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమ గురుకుల రీజినల్ కోఆర్డినేటర్ డి. ఎస్. వెంకన్న గారు ఒక ప్రకటనలో తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా
1.గిరిజన సంక్షేమ డిగ్రీ మహిళా కళాశాల డిగ్రీ లెక్చరర్-ఫ్యాషన్ డిజైన్-03,
ఇంటీరియర్ డిజైన్-01,
డిజిటల్ ఇమేజింగ్లో ఫొటోగ్రఫీ-01
2. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మానాల TGT ఫిజికల్ సైన్స్-01
విద్యార్హతలు:
డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదే సబ్జెక్టులో కనీసం 2 సంవత్సరాల బోధన లేదా ఫీల్డ్ అనుభవం కలిగిన అభ్యర్థులకు వరుసగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ii)TGT ఏస్థులకు - సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు, B.Ed., TET ఉత్తీర్ణులై ఉండాలి.
డెమో, ఇంటర్వ్యూ
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు September-02న ఉదయం 9.00 గంటలకు TGTWRDC (W) (గిరిజన సంక్షేమ డిగ్రీ మహిళా కళాశాల) రాజన్న సిరిసిల్ల జిల్లా నందు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు జిరాక్స్ సెట్లతో డెమో, ఇంటర్వ్యూకు హాజరు కావాలని రీజినల్ కోఆర్డినేటర్ డి. ఎస్. వెంకన్న గారు ఒక ప్రకటనలో తెలిపారు. బాలికల విద్యాలయాల్లో కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించబడుతుందని పేర్కొన్నారు.