పెద్దూరులో అంబేద్కర్ సంఘం (మాల) నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

అంబేద్కర్ సంఘం (మాల) నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
రాజన్నసిరిసిల్ల, 20 జనవరి 2026: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ ఉమ్మడి గ్రామ పరిధిలోని మాల సామాజిక వర్గానికి నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శులుగా రాకం రాజేశం, రెడ్డిమల్ల దేవరాజు, గొర్రె రమేష్, కొంపల్లి అశోక్, అధికార ప్రతినిధులుగా సదాది రాజయ్య, మంగ సత్యనారాయణ, గొర్రె ఎల్లయ్య, జంగిటి స్వామిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ ఎన్నికకు సహకరించిన సంఘం ప్రతినిధులందరికీ ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పెద్దూరు మాజీ సర్పంచ్ రాకం రమేష్, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post