MAA అసోసియేషన్ నుంచి నటి హేమ సస్పెండ్.. ?

"MAA"అసోసియేషన్ నుంచి నటి హేమ సస్పెండ్?



హైదరాబాద్ :- బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సినీ నటి హేమను సినీ ఇండస్ట్రీ సస్పెండ్ చేసింది. 

పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛాంబర్ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. హేమను సస్పెండ్ చేసే అంశంపై నిన్న సుదీర్ఘంగా చర్చించారు. 

ఈరోజు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు విష్ణు ప్రకటిం చారు. హేమ ప్రాథమిక సభ్యత్వం రద్దు బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని ‘మా’ సెక్రటరీ రఘుబాబు తెలిపారు. 

డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిందన్నారు. అందుకే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మా అసోసియేషన్ నుంచి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. 

విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తదుపరి నోటీసు వచ్చే వరకు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Post a Comment

Previous Post Next Post