ఈనెల 8న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం..?
హాజరుకానున్న బంగ్లాదేశ్ ప్రధాని, శ్రీలంక అధ్యక్షుడు
న్యూ ఢిల్లీ :- దేశ ప్రధానిగా మోడీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 8న సాయంత్రం 8 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
మోడీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాలకు చెందిన తరలిరానున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే హాజరు కానున్నారు.
ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా రణిల్ విక్రమసింఘేను ప్రధాని మోడీ ఆహ్వానించారని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది.
వీరితోపాటు భూటాన్, నేపాల్, మారిషస్ దేశాధినేతలను కూడా ప్రధాని మోదీ ఆహ్వానించనున్నట్లు తెలుస్తున్నది.