హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లక్ష్యంగా గురువారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు ఆచార్య జయశంకర్ బడిబాట నిర్వహించనున్నారు. వాస్తవంగా ఈ నెల 3వ తేదీ నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని తొలుత ఉత్తర్వులు జారీచేసిన విద్యాశాఖ తర్వాత దాన్ని 6వ తేదీకి వాయిదా వేసింది. ఆ మేరకు తాజాగా మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో భాగంగా 11వ తేదీ వరకు జరగాల్సిన కార్యక్రమాలు, బడులు పునఃప్రారంభమైన 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రకటించింది. ఉత్తర్వుల నేపథ్యంలో బడిబాటను విజయవంతం చేసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేద్దామని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో పిలుపునిచ్చారు.
తెలంగాణలో నేటి నుంచి బడిబాట కార్యక్రమం
byJanavisiontv
-
0