సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో కౌన్సిలర్ బోల్గం నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి 10వ వార్డు కౌన్సిలర్ బొల్గమ్ నాగరాజు మాట్లాడుతూ.. తెలంగాణలో వ్యవసాయం వర్షాధారంపై ఆధారపడి ఉన్నందున రైతులు విత్తనాలు వేసిన సమయానికి వర్షాలు కురవడం వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నారు. రైతులు సుఖ సంతోషాలతో ఉండాాలంటే కాలానుగుణంగా వర్షాలు కూరవాలని గ్రామదేవతలకు మొక్కలు చెల్లించుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో వార్డు పెద్దలు, మహిళలు, యువకులు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
వానలు కురవాలంటూ.. గ్రామ దేవతలకు జలాభిషేకం
byJanavisiontv
-
0