తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాహుల్ గాంధీ మూడు రోజులు బస్సు యాత్రలో భాగంగా రెండో రోజైన ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మీదుగా విజయభేరి బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు.
మేడిపల్లి వద్ద పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు.బైక్ ర్యాలీ ద్వార కాటారం కార్నర్ సెంటర్ కి రాహుల్ గాంధీ చేరుకున్నారు.
కాటారం కార్నర్ సెంటర్ లో రాహూల్ గాంధీ ఈ సందర్భంగా ప్రసంగించారు. దేశంలోనే అవినీతి ప్రభుత్వము ఒక తెలంగాణలోనే ఉందన్నారు.తెలంగాణలో అన్ని అధికారాలు ఒక్క కుటుంబానికే పరిమితమైందన్నారు.
ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయన్నారు.
కెసిఆర్ అవినీతిపై ఈడి సిబిఐ, విచారణ ఎందుకు జరపడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కెసిఆర్ అవినీతి పాలన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. తెలంగాణలో పేదల, రైతుల, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి మహిళలే వెన్నుముక అన్నారు. కాటారంలో ఈ జన ప్రభంజనం చూస్తుంటే కెసిఆర్ ఓటమి ఖాయమన్నారు.
అంతకుముందు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కే.టి.పీ.పీ గోదావరి గెస్ట్ హౌస్ లో నేడు రేవూరి ప్రకాష్ రెడ్డి తో పాటు మరికొంతమంది రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అనంతరం బస్సు యాత్ర కేటీకే 5వ గని నుండి బాంబులగడ్డ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. కేటికే 1.వ గని వద్ద సింగరేణి కార్మికులతో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గేట్ మీటింగ్ నిర్వహించారు.అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు.
సింగరేణి ఒకటో గని గేట్ మీటింగ్ కి రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంతో చర్చనీయాంశంగా మారింది...