ఈరోజు ప్రధాన అంశాలు

ఈరోజు ప్రధాన అంశాలు:
1. ఢిల్లీ:
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. ఫైబర్ నెట్ కేసులో హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన చంద్రబాబు..

2. రాహుల్ గాంధీ రోడ్ షో:
 రాహుల్ గాంధీ మూడో రోజు విజయభేరి బస్సు యాత్ర షెడ్యూల్.. ఉదయం 9 గంటలకు చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం గంగాధర వద్ద సమావేశం.. 9.30కి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు.. 11 గంటలకు జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్.. 12 గంటలకు వేములవాడ నియోజక వర్గం మేడిపల్లి లో సమావేశం.. మధ్యాహ్నం ఒంటి గంటకు కోరుట్ల లో సమావేశం, 1.30కి భోజన విరామం.. 2.30 గంటలకు ఆర్మూర్ లో సభ.. ఆర్మూర్ నుండి హైదరాబాద్ చేరుకుని ఢిల్లీకి వెళ్లనున్న రాహుల్.. నేటితో మొదటి దశ కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర ముగింపు.

3. సిద్దిపేట:
నేడు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్‌ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం.. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ (మం) అంతాయపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటలకు భేటీ.. హాజరుకానున్న మంత్రి హరీష్ రావు.. గత ఎన్నికల సమయంలోనూ పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించిన సీఎం.. ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్

4. ఢిల్లీ:
నే డు సుప్రీంలో బీఆర్ఎస్‌ పిటిషన్‌పై విచారణ.. ఎన్నికల గుర్తుల కేటాయింపుపై సుప్రీంను ఆశ్రయించిన బీఆర్ఎస్.. కారు గుర్తును పోలిన గుర్తులను మరొక పార్టీకి కేటాయించడాన్ని సవాల్ చేసిన బీఆర్ఎస్.. ఫ్రీ సింబల్స్ జాబితాలో కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని పిటిషన్

Post a Comment

Previous Post Next Post