తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు: పెద్దపెల్లి డీసీపీగా చేతన

హైదరాబాద్, 20 అక్టోబర్(జన విజన్ న్యూస్):
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఫిర్యాదులు వస్తే చాలు.. ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా చర్యలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగానే.. పలు రాజకీయ పార్టీలు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకృష్ణ రావుపై ఫిర్యాదు చేశాయి. ఆయన వ్యవహార శైలిని ప్రశ్నించాయి.

రిటైర్ అయిన తర్వాత కూడా..స్పెషల్ ఆన్ డ్యూటీ కింది.. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించటాన్ని సవాల్ చేశాయి.

రాజకీయ పార్టీలు. అదే విధంగా పలువురు పోలీస్ అధికారులపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాయి.


దీనిలో భాగంగానే పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కొంతమందిని హైదరాబాద్ పోలీస్ అకాడమీకి అటాచ్ చేశారు.

పలువురు ఐపిఎస్ అధికారులకు పోస్టింగ్…‘టీఎస్పీఏ జాయింట్ డైరెక్టర్‌గా రంగనాథ్,

టీఎస్పీఏ డిప్యూటీ డైరెక్టర్‌గా రాజేంద్ర ప్రసాద్,

సౌత్ వెస్ట్ జోన్ డిసిపి గా బాలస్వామి 

సిఐడి ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి,

గ్రే హౌండ్స్ ఎస్పీగా వెంకటేశ్వర్లు,

సౌత్ వెస్ట్ జోన్ డిసిపిగా నితికా పంత్,

రాచకొండ జాయింట్ సీపీ,గా తరుణ్ జోషి 

సౌత్ ఈస్ట్ జోన్ డిసిపిగా రోహిత్ రాజ్,

ట్రాఫిక్ డిసిపిగా ఆర్.వెంకటేశ్వర్లు,

పెద్దపల్లి డిసిపిగా చేతన ను నియమిస్తూ.. అధికారులు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Post a Comment

Previous Post Next Post