తిరుమల, 24 అక్టోబర్(జనవిజన్ న్యూస్): సమిష్టి కృషి, సమన్వయంతో తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి రెండు బ్రహ్మోత్సవాలు విజయవంతమైనట్లు తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.
బ్రహ్మోత్సవాలు విజయవంతం చేశామని... భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
వాహనసేవల్లో ఉత్సవాలు చేసిన భక్తులు మధురానుభూతి పొందారన్న భూమన కరుణాకర్ రెడ్డి.
ఈ బ్రహ్మోత్సవాల్లోనే టీటీడీ ఉద్యోగుల కల నెరవేరిందని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగులకు ఇంటి స్ట లాలను అందజేశామన్నారు.
వాహనసేవల ముందు 15రాష్ట్రాలకు చెందినప్రత్యేక కళా బృందాలు భక్తులను అలరించాయన్నారు.