రాజన్న సిరిసిల్ల జిల్ల 17వ పోలీస్ బెటాలియన్‌లో ఘనంగా మట్టి గణపతి నిమజ్జనం

రాజన్న సిరిసిల్ల జిల్ల 17వ పోలీస్ బెటాలియన్‌లో ఘనంగా మట్టి గణపతి నిమజ్జనం

భక్తి పాటలు, జై గణేశ్ నినాదాలతో సాగిన గణపతి ఊరేగింపు

సిరిసిల్ల, 19 సెప్టెంబర్ 2026: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ పరిధిలోని సర్దాపూర్ వద్ద గల 17వ పోలీస్ బెటాలియన్‌లో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఐదవ రోజు పూజలు పూర్తయిన అనంతరం శనివారం గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని బెటాలియన్ సిబ్బంది ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ పి.జె.పి.సి. ఛటర్జీ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం గణపతి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి నిమజ్జనానికి తరలించారు. బెటాలియన్ అధికారులు, సుమారు 350 మంది బెటాలియన్ సిబ్బంది కాన్వాయ్‌గా గణపతి విగ్రహం వెంట భక్తి పాటలు, జై గణేశ్ నినాదాలతో గణపతి ఊరేగింపు ఉత్సాహంగా జరిపారు.

అనంతరం గణపతి విగ్రహాన్ని వెంకటాపూర్ మానేరు వాగులో భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. అధికారులు, సిబ్బంది గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.

వినాయక నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన గణపతి లడ్డూ వేలం కార్యక్రమంలో 17వ పోలీస్ బెటాలియన్‌కు చెందిన హెడ్ క్వార్టర్స్ కంపెనీ సిబ్బంది రూ.35,000లకు గణపతి లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూ వేలం కార్యక్రమంలో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణహిత సందేశాన్ని అందించారు. మొత్తం నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరిగింది.

Post a Comment

Previous Post Next Post