షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహకార పథకాలకు ఆహ్వానం

పత్రిక ప్రకటన
శ్రీయుత వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంఘం లి" హైదరాబాద్ వారు 12.03.2026 న ఎస్.సి యాక్షన్ ప్లాన్ 2025-26 ను విడుదల చేయడం జరిగినది. ఇట్టి ఆక్షన్ ప్లాన్ లో బ్యాంకు అనుసంధానం తో ఆర్ధిక సహాయ పథకములు: 1. రవాణా రంగం పథకం క్రింద A. EV టూ వీలర్, B. EV త్రి వీలర్, 2, వ్యవసాయ పథకములు క్రింద : A. సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ ఆహ్వానించడమైనది.

కావున రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల మరియు మున్సిపాలిటీ పరిధి లోని షెడ్యూల్డ్ కులాల అభ్యర్ధులు, వ్యవసాయేతర పథకములకు వయస్సు 21 నుండి 50 సం!! ల వరకు మరియు వ్యవసాయ ఆధారిత పథకములకు వయస్సు 21 నుండి 60 సం! కలిగిన వారు ఆన్లైన్ ప్రక్రియ (tsobmms.cgg.gov.in) (ఇంటర్ నెట్ / మీసేవా సెంటర్) నందు తేది 17.03.2026 నుండి తేది 24.03.2026 వరకు నమోదు చేసుకోగలరని కోరనైనది. ఇట్టి అభ్యర్ధుల యొక్క సంవత్సర ఆదాయం రూ. 1,50,000 గ్రామీణ ప్రాంతాల వారికి మరియు రూ.2,00,000/- (పట్టణ ప్రాంతాలైన మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీల ప్రాంతాల వారికి) మించకుండా ఆదాయం కలిగి ఉండాలి.

అభ్యర్ధులు ఆన్లైన్ చేసుకోవటానికి అవసరమైన పత్రములు:

1. ఆధార్ కార్డ్

2. రేషన్ కార్డు / ఫుడ్ సెక్యూరిటీ కార్డు

3. కుల ధృవీకరణ పత్రం (మీసేవ జారీ చేసింది)

4. ఆదాయ ధృవీకరణ పత్రం ( మీసేవ జారీ చేసింది)

5. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా రంగం పధకములకు )

6. EV ద్విచక్ర వాహనాల కోసం ఎస్.సి వ్యవస్థాపకులు / గిగ్ కార్మికులకు ప్రాధాన్యత ໖. Zomato, Swiggy, Rapido సంబంధింత సర్టిఫికెట్ సమర్పించాలి. Uber

7. పట్టాదార్ పాస్ బుక్ ( సోలారా పంప్ సెట్ కోసం కనీసం రెండు ఎకరముల భూమి అవసరం)

8. సదరం సర్టిఫికెట్ (PWD ల కోసం )

9. పాస్ పోర్ట్ సైజ్ ఫోటో


జిల్లా కలెక్టర్ & చైర్మన్

జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంఘం లి. రాజన్న సిరిసిల్ల.

Post a Comment

Previous Post Next Post