యువత ఏటీసీ సెంటర్లు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

యువత ఏటీసీ సెంటర్లు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
అడ్మిషన్ల ప్రక్రియ మొదలు

పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్

-------------------------------
రాజన్నసిరిసిల్ల, 13 ఆగస్టు 2025
-------------------------------

యువత ఏటీసీ సెంటర్లు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని ఏటీసీ సెంటర్లో అడ్మిషన్ల ప్రక్రియ పోస్టర్లు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
2025-26/27 విద్యా సంవత్సరానికి ఐ.టి.ఐ లలో అడ్మిషన్ కొరకు గడువు ఈ నెల 6 వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు.

అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికేట్ లను {పదో తరగతి, కుల ధృవీకరణ, స్థానిక (లోకల్) స్టడీ (కనీసం 6 తరగతులు తెలంగాణలో చదివి ఉంటే వారిని స్థానిక అభ్యర్థులుగా పరిగణిస్తారని వివరించారు. తీసేని ఆన్లైన్లో మీ పాసుపోర్ట్ సైజ్ ఫోటోతో సహా స్కాన్ చేసి అప్ లోడ్ చేసుకోవాలని సూచించారు. https://iti.telang ana.gov.in అనే వెబ్ సైట్ నందు, మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు 
ఏటీసీలో 
1. CNC MACHINING TECHNICIAN, 
2. ENGINEERING DESIGN TECHNICIAN , 
3. INDUSTRIAL ROBOTICS AND DIGITAL MANUFACTURING TECHNICIAN, 
4. MANUFACTURING PROCESS CONTROL AND AUTOMATION TECHNICIAN, 
 5. MECHANIC ELECTRIC VEHICLE 
6. VIRTUAL ANALYSIS AND DESIGNER-FEM (FINITE ELEMENT METHOD) 
తెలిపిన ట్ట్రేడ్ లలో అవకాశం ఉన్నదని వెల్లడించారు. 


1-8-2025 నాటికి అభ్యర్థికి కనీసం 14 సంవత్సరాలు నిండి ఉండాలని, అభ్యర్థుల మార్కులు, రిజర్వేషన్, స్థానికత, మీ ఆప్షన్ ల ఆధారంగా సీట్ (అడ్మిషన్) కేటాయిస్తారని స్పష్టం చేశారు ఐటీఐలో కూడా అప్లికేషన్ స్వీకరించరని, ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ కవిత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post