ఐ.టి.ఐ లలో అడ్మిషన్ కొరకు గడువు ఈ నెల 6 నుండి ఆగస్టు -28

తెలంగాణ ప్రభుత్వము
ఉపాధి మరియు శిక్షణా శాఖ
ఐ.టి.ఐ. మరియు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లలో మూడవ విడత (వాక్- ఇన్ ) అడ్మిషన్ (2025-26/27)
2025-26/27 విద్యా సంవత్సరానికి ఐ.టి.ఐ లలో అడ్మిషన్ కొరకు గడువు ఈ నెల 6 వ తేదీ నుండి ఆగస్టు -28 తేదీ వరకు సిరిసిల్ల ప్రభుత్వ ఐ.టి.ఐ. ప్రిన్సిపాల్ శ్రీమతి.యస్.కవిత గారు ఒక ప్రకటనలో తెలిపారు. 
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐ.టి.ఐ. లలో (ఒకటి మరియు రెండు సంవత్సరాల కోర్సులకు) ఈ సంవత్సరం 2025-26/27 అడ్మిషన్ల కొరకు మూడవ విడత దరఖాస్తుల స్వీకరణ (ఆన్లైన్ లో) ఆగస్టు -06 వ తేదీ నుండి ప్రారంభం అయ్యి ఆగస్టు -28 వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉన్నట్లు ప్రిన్సిపల్ గారు తెలియజేసారు. అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికేట్ లను {యస్.యస్.సి, కుల దృవీకరణ(కొత్తది), స్థానిక (లోకల్) స్టడీ (కనీసం 6 తరగతులు తెలంగాణలో చదివి ఉంటే వారిని స్థానిక అభ్యర్థులుగా పరిగణిస్తారు) మరియు బదిలీ (టి. సి) లను ఆన్లైన్లో మీ పాసుపోర్ట్ సైజ్ ఫోటోతో సహా స్కాన్ చేసి అప్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
  ఇందుకు గాను https://iti.telangana.gov.in అనే వెబ్ సైట్ నందు , మీ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలని ( మీ స్వంత మరియు పర్మనెంట్ ఫోన్ నెంబర్ వాడుట మంచిది. ఎందుకంటే ఆ తరువాత మీ ఆడ్మిషన్ కు సంబంధించిన ప్రతీ ఉత్తర ప్రతుత్తరాలు చిన్న సమాచారాల ద్వార (SMS) మీకు తెలియపరుస్తారు).
వాక్- ఇన్ అడ్మిషన్ యొక్క వివరాలు:
 మీరు ITI అప్లికేషన్ ఫారం తో, పైన తెలిపిన ఒరిజినల్ సర్టిఫికెట్లతొ పాటు ఉదయం 10:00 గం నుండి 1:00 గం లోపు గవర్నమెంట్ ఐ టి ఐ సిరిసిల్ల నందు హాజరు కాగలరు.
ప్రభుత్వ ఐ.టి.ఐ. సిరిసిల్ల నందు : 
1. FITTER
2. MECHANIC (MOTOR VEHICLE) 
3. MECHANIC (DIESEL) 
4. COMPUTER OPERATOR AND PROGRAMMING ASSISTANT
5. FASHION DESIGN AND TECHNOLOGY మరియు
Advance Technology Centre (ATC) నందు:
1. CNC MACHINING TECHNICIAN 
2. ENGINEERING DESIGN TECHNICIAN  
3. INDUSTRIAL ROBOTICS AND DIGITAL MANUFACTURING TECHNICIAN 
4. MANUFACTURING PROCESS CONTROL AND AUTOMATION TECHNICIAN 
5. MECHANIC ELECTRIC VEHICLE 
6. VIRTUAL ANALYSIS AND DESIGNER-FEM (FINITE ELEMENT METHOD) 

పైన తెలిపిన ట్ట్రేడ్ లలో అవకాశం కలదు. కావున అర్హత గల విద్యార్థినీ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీమతి.యస్.కవిత గారు తెలియజేశారు.
వివరాలు
1-8-2025 నాటికి అభ్యర్థికి కనీసం 14 సంవత్సరాలు నిండి ఉండాలి. అభ్యర్థుల మార్కులు, రిజర్వేషన్, స్థానికత మరియు మీ ఆప్షన్ ల ఆధారంగా మీకు సీట్ (అడ్మిషన్) కేటాయించబడును. 
ఏ ఐ.టి.ఐ. లో కూడా అప్లికేషన్ స్వీకరించబడవు. ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి.
విద్య అర్హత మరియు కోర్స్, సిలబస్ వివరాలు వెబ్ సైట్ నందు పొందుపరచబడ్డాయి. ఇతర వివరాలకు మీ దగ్గరలోని గవర్నమెంట్/ ప్రైవేటు ఐ.టి.ఐ. ని సంప్రదించండి.

Post a Comment

Previous Post Next Post