రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో మీసేవ సెంటర్ లు నెలకొల్పేందుకు ప్రభుత్వ ప్రకటన
అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపిన కలెక్టర్ కార్యాలయం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజల సౌకర్యార్థం (1) మూడపల్లి గ్రామం చందుర్తి మండలం, (2) గంబిరావుపేట గ్రామం గంబిరావుపేట మండలం (3) జిల్లెల్ల గ్రామం తంగళ్ళపల్లి మండలం (4)తెట్టెకుంట (అగ్రహారం) గ్రామం వేములవాడ అర్భన్ మండలం (5) చీకోడ్ గ్రామం ముస్తాబాద్ మండలం (6) మానాల గ్రామం రుద్రంగి మండలం (7) సుభాష్ నగర్ సిరిసిల్ల, సిరిసిల్ల మండలం పైన తెల్పిన గ్రామాలలో (07 ) నూతన మీ సేవ కేంద్రములను ఏర్పాటు చేయుటకు నిర్ణయించనైనది. అర్హులైన అభ్యర్తులు తమ దరాఖాస్తులను తేది 14.08.2025 నుండి తేది 19.08.2025 వరకు కలెక్టర్ కార్యాలయము, రాజన్న సిరిసిల్ల నందు సమర్పించాలని తెలిపారు. అభ్యర్ధుల అర్హతలు, దరఖాస్తు నమూనా, ఇతర నియమ నిబందనలు జిల్లా వెబ్ సైట్ (http://rajannasircilla.telangana.gov.in) నందు పొందు పరచబడినది. అర్హత గలవారు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.