ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కథలాపూర్ మండలం కలికోట, పొతారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ప్రభుత్వ విప్
ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.. ఆదివారం కథలాపూర్ మండలం కలికోట,పొతారం గ్రామంల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లును రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కలికోట గ్రామంలో 7, పోతారo గ్రామంలో 12 ఇల్లు నిర్మాణ దశలో ఉన్నాయని ఇప్పటికే బేస్ మెంట్ పూర్తి చేసుకొని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందనీ తెలిపారు. గత ప్రభుత్వం పది సంవత్సరాలపాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేయలేదని అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినట్లుగా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చెసి నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందనీ తెలిపారు.
లబ్ధిదారులు మాట్లాడుతూ..
గతంలో ఇందిరమ్మ కాలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయని, గత పది సంవత్సరాల్లో గృత ప్రభుత్వం డబ్బులు బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ఒక్క ఇల్లు కూడా కట్టి ఇవ్వలేదని వాపోయారు. మళ్లీ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషితో నేడు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇల్లు పథకం పేదోడికి గొప్ప వరం లాంటిదనీ అసలు ఉండటానికి ఇల్లు లేని వారికి ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంతో సొంత ఇల్లు ఉందన్న సంతృప్తి కలుగుతోందన్నారు. ఇప్పటకి బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన వాటికి రూ.ఒక లక్ష రూపాయల బిల్లు వచ్చింది. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.