సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 
జాతీయ జెండాను ఎగురవేసిన సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కె. కృష్ణ

భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు అయిన సందర్భంగా సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే కృష్ణ ఆధ్వర్యంలో.. సిబ్బంది జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కె.కృష్ణ మాట్లాడుతు.. ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం వలన స్వాతంత్రం సాధ్యమైందని అన్నారు. ఆ త్యాగదనుల కృషిని స్మరించుకుంటూ వేడుకలు జరుపుకోవడం గొప్ప విషయమని అన్నారు. పట్టణ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్స్, హెడ్ కానిస్టేబుల్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post