ఓట్ చోర్.. గద్దె చోడ్ నినాదంతో కాంగ్రెస్ భారీ ర్యాలీ

దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది
రాహుల్ గాంధీ పోరాటం వలన దొంగ ఓట్లను ఎన్నికల కమిషన్ తొలగిస్తుంది

బీజేపీ అబద్ధపు పునాదులపై ప్రభుత్వాన్ని నడిపిస్తుంది

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్నసిరిసిల్ల, 14 ఆగస్టు 2025:
............................................

దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏఐసీసీ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.
బిజెపి ప్రజల ఓట్లను కొల్లగొడుతూ గెలుస్తున్నటువంటి స్థితిగతులను.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ ఆధ్వర్యంలో కళ్ళకు గట్టినట్లు వీడియో రూపంలో ప్రజలకు చూపించడం జరిగిందన్నారు. వీడియో చూసిన ప్రజల మనసుల్లో బిజెపి ఏ విధంగా ఓట్లు కొల్లగొడుతుంధో స్పష్టంగా అర్ధం అయ్యిందని తెలిపారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేయడాన్ని చూసి బిజెపి ప్రభుత్వం బయటపడిందన్నారు. బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకలను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం తప్పుపడుతూ ఆల్ ఇండియా కాంగ్రెస్, పిసిసి పిలుపుమేరకు దేశంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఓటు చోర్ గద్దె చోడ్ నినాదంతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ఒక ఇంట్లో హౌస్ నెంబర్ లేకుండా 200 ఓట్లు మరో ఇంట్లో ఒకే ఇంటి నెంబర్ తో 80 ఓట్లు ఏ విధంగా వచ్చాయని, బిజెపి ఎన్నికల కమిషన్తో కుమ్మక్క అయిందని పేర్కొన్నారు . రాహుల్ గాంధీ ఎన్ని ప్రశ్నలు సంధించిన ఎన్నికల కమిషన్ నుండి కనీసం సమాధానం కూడా రావడం లేదు అన్నారు.

రాష్ట్రాల్లో లక్షల ఓట్లు అక్రమంగా ఎన్నికల కమిషన్ చేర్చితే రాహుల్ గాంధీ పోరాటం వల్ల వాటిని తొలగించడం జరుగుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు బిజెపి ప్రభుత్వం చేస్తున్న ఓట్ల దొంగతనాన్ని కళ్లకు కట్టినట్టు చెప్పడం జరిగిందన్నారు..

రానున్న రోజుల్లో గ్రామ గ్రామాన ఓటు చోర్ గద్దె చోడు నినాదంతో సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతికి పంపించడం జరుగుతుందని అన్నారు. బిజెపి ప్రభుత్వం అబద్ధపు పునాదులపై ప్రభుత్వాన్ని నడుపుతుందని పేర్కొన్నారు. భారత్ జోడోయాత్ర ద్వారా రాహుల్ గాంధీ ప్రజల్లో అసమానతలు రూపుమాపడానికి పాదయాత్ర చేశారని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post