రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు పంపిణీ

లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ


రాజన్నసిరిసిల్ల, 15 ఆగస్టు 2025
------------------------------------


దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా క్యాంప్ ఆఫీస్, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జాతీయ జెండాను ఆవిష్కరించి, వందనం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని మైదానంలో ఏర్పాటు చేసిన 
స్వాతంత్ర్య వేడుకలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, వందనం చేశారు. 
ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను వెల్లడించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే తదితరులు ప్రశంసా పత్రాలు పంపిణీ చేసి, అభినందించారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.

లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ

జిల్లాలోని 495 మంది ముస్లిం మహిళలు, ఏడుగురు క్రిస్టియన్ మహిళలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే తదితరులు కలిసి పంపిణీ చేశారు.

Post a Comment

Previous Post Next Post