మాల సామాజికవర్గ భవన నిర్మాణం కోసం సహకారం అందించండి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు విజ్ఞప్తి చేసిన కోనరావుపేట మాల మహానాడు నాయకులు
రాజన్నసిరిసిల్ల, 09 జూలై 2025: మాల మహానాడు కోనరావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను మర్యాద పూర్వకముగా కలిసి శాలువాతో సన్మానించారు. మాల సామాజికవర్గానికి మండల కేంద్రంలో భవనం నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేయాలంటూ బుధవారం వేములవాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను సంఘం ప్రతినిధులు కలిసి వినతి పత్రం సమర్పించారు. తమ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షులు మాందాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మాదాసు భూమయ్య, ప్రధాన కార్యదర్శి ఎడ్ల సుధాకర్, క్యాషియర్ కులేరు చంద్రయ్య, మండల యూత్ అధ్యక్షులు మాసం జనార్ధన్, బొల్లం శ్రీనివాసు, అనంతరావు, ఎర్ర ఆగేష్, అంగూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.