లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధ చెక్కుల పంపిణీ
సిరిసిల్ల, 9 జూలై: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులంతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వివిధ ఆస్పత్రుల్లో వైద్య సహాయం పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పెద్దూరులో చెక్కులను అందించారు. సిరిసిల్ల అర్బన్ పరిధి పెద్దూరులోని 8వ వార్డ్ లో ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులైన జాన సోని, మండలి అజయ్, సలెంద్రి పవన్ కళ్యాణ్, చక్రాల లత లకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు ఆధ్వర్యంలో చెక్కులను అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు, పెద్దూర్ మాజీ సర్పంచ్ రాకం రమేష్, మండలి అంజయ్య, జాన వేణు, అనంతుల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.