పెద్దూరులో ఘనంగా కెకె మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
సిరిసిల్ల, 10 జూలై 2025: సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు సిరిసిల్లలో ఘనంగా జరిగాయి. గురువారం సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూరులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు ఆధ్వర్యంలో పెద్దూరు పరిధిలోని మూడు ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థిని, విద్యార్థులకు అరటిపళ్ళు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇప్పలపల్లి లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, బాబాజీ నగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు స్థానిక నాయకులతో కలిసి అరటి పండ్లు పంపిణీ చేశారు. మొదటగా కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. కార్యక్రమంలో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులతో పాటు, పెద్దూరు మాజీ సర్పంచ్ రాకం రమేష్, రాకం పెద్ద నరసయ్య, రెడ్డిమల్ల చిన్న దేవయ్య, తిప్పవరం నరసయ్య, కాసారం ఎల్లయ్య, తిమ్మనగరం శ్రీనివాస్, చల్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.