మధ్యాహ్న భోజన పథకానికి సిలిండర్ల పంపిణీ
సిరిసిల్ల, 28 జూలై 2025: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథక నిర్వహణ మరింత సులభతరం కానుంది. సోమవారం సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూరులో రెండు పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం అమలు సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున గ్యాస్ సిలిండర్లను అందజేశారు. పెద్దూర్ లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు సిలిండర్లను, బాబాజీనగర్ ప్రాథమిక పాఠశాలలో రెండు సిలిండర్లను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వాహకులకు అందజేశారు. మధ్యాహ్న భోజన పథకంలో వంటల నిర్వహణకు సిలిండర్ల పంపిణీ ఎంతో ఉపకరిస్తుందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సర్పంచ్ తాళ్లపెళ్లి బాలరాజు, గుగ్గిళ్ళ తిరుపతి, ప్రదానోపాధ్యాయులు గడ్డం శంకర్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, తిరుపతి, లక్ష్మి, లక్ష్మి, స్థానికులు ఉపేందర్, చల్ల రాము, నాంపల్లి, కాసరం ఎల్లయ్య, తిమ్మనగరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.