యూరియా సరఫరా విషయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు మాటలు అర్థరహితం: రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
యూరియా సరఫరా విషయంలో బిజెపి కావాలని రాజకీయం చేస్తుంది
రైతులపై బీజేపీ వారు కపట ప్రేమ చూపిస్తున్నారు
కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ లో 9 లక్షల 80 వేల మెట్రిక్ టన్నులు కేటాయించి 12 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశాం అని చెబుతుండడం శుద్ద అబద్ధం
కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల నుండి జూలై వరకు రాష్ట్రానికి 6 లక్షల 60 వేల మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 4 లక్షల 23 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసింది
ఇప్పటికైనా రైతులను బిజెపి వారు తప్పుదోవ పట్టించడం మానుకోవాలి
యూరియా సరఫరా విషయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు అవగాహన లేక మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల టన్నులపైగా ఎరువులు కావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడం పట్ల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన యూరియాను వెంటనే సరఫరా చేయాలన్నారు..
యూరియా సరాపర విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేసిన వారు స్పందించలేదన్నారు.. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో 1 లక్ష 70 మెట్రిక్ టన్నులు కేటాయించి కేవలం 1,21 వేల మెట్రిక్ టన్నులను మాత్రమే సరఫరా చేసింది,మే నెలలో 1 లక్ష 60 వేల మెట్రిక్ టన్నులు కేటాయించింది కానీ 88 వేల మెట్రిక్ టన్నుల సరఫరా చేసింది,జూన్ నెలలో 1 లక్ష 70 వేల మెట్రిక్ టన్నుల కేటాయించింది కానీ 98 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసింది,జూలై నెలలో 1 లక్ష 60వేల మెట్రిక్ టన్నుల కేటాయించింది కానీ 1 లక్ష 16 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేసిందన్నారు..
ఏప్రిల్ నెల నుండి జూలై వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 6 లక్షల 60 వేల మెట్రిక్ టన్నులు కేటాయించి కేవలం 4 లక్షల 23 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసిందని, మన రాష్ట్రానికి రావాల్సిన యూరియా కంటే 2 లక్షల 37 వేల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం తక్కువ సప్లై చేసిందన్నారు... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ ఖరీఫ్ సీజన్లో కేవలం 9 లక్షల 80 వేల మెట్రిక్ టన్నులు కేటాయిస్తే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు 12 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశాం అని చెబుతుండడం శుద్ధ అబద్ధం అన్నారు... ఇలాంటి ప్రకటనలు చూస్తే రైతులపై బిజెపి వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందన్నారు...
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతుల అవసరాల కోసం ఒక నెల ముందుగానే యూరియా నిలువలను సిద్ధం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుందని కానీ కేంద్ర ప్రభుత్వం నుండి సరియైన సహాయ సహకారాలు అందడం లేదని తెలిపారు..
బిజెపి నాయకులకు రైతులపై చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటాను తెప్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.