కరీంనగర్ 04 జూన్: కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎక్కడ ఎలాంటి జాప్యం జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎనిమిదిన్నర గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు నిర్వహించాలని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పారదర్శకంగా హోటల్ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు. ఏడు నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
కౌంటింగ్ సిబ్బంది కేటాయింపు
కౌంటింగ్ సిబ్బందిని టేబుల్స్ వారిగా కేటాయించారు. మంగళవారం ఉదయం 6 గంటలకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సారథ్యంలో కౌంటింగ్ సిబ్బంది రాండమేజేషన్ నిర్వహించారు. ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వారీగా సిబ్బందిని పకడ్బందీగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు, ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా, కౌంటింగ్ అబ్జర్వర్ జి నజ్మా, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆర్డీవోలు కే మహేశ్వర్, రామ్మూర్తి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.