మూడోసారి ప్రధానిగా మోడీ : తొలి విదేశీ పర్యటన ఖరారు

మూడోసారి ప్రధానిగా మోడీ : తొలి విదేశీ పర్యటన ఖరారు



న్యూ ఢిల్లీ :- దేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోడీ తొలి విదేశీ పర్యటన ఖరారైనట్లు సమాచారం. 

జూన్‌ 13 నుంచి 15 వరకు జరిగే జీ7 సమావేశాల కోసం మోడీ ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

జీ7 సమావేశాలకు రావా ల్సిందిగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మోడీని ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి మోడీ ఓకే అన్నట్లు తెలిసింది..

తనను ఆహ్వానించినం దుకు మెలోనికి మోడీ కృతజ్ఞతలు చెప్పారని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

ప్రపంచ ఆర్థికవ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణమార్పులు, రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధాల ప్రభావం తదితర అంశాలపై జీ7 సదస్సులో చర్చించనున్నారు.

Post a Comment

Previous Post Next Post