సిరిసిల్ల 03, నవంబర్ 2023
రాష్ట్ర శాసన సభ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించబడిన ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి (maniganda samy)
జిల్లా కేంద్రానికి గురువారం రాత్రి చేరుకున్నారు.
పంచాయితీ రాజ్ గెస్ట్ హౌస్ లో శుక్రవారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పి అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ లు పరిశీలకులకు మొక్కలను అందించి స్వాగతం పలికారు.
అనంతరం ఎన్నికలలో వ్యయ లెక్కింపునకు ఏర్పాటు చేసిన, కమిటీ లు, బృందాలు, వాటి పనితీరును వివరించారు.
ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం వివరాలు తెలియజేశారు.