కొయ్యకుండానే సామాన్యునికి కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి

ఆదిలాబాద్ జిల్లా:నవంబర్ 03
సామాన్యులకు మొన్నటి వరకు టమాటా కన్నీళ్లు పెట్టించగా ..తాజాగా ఇప్పుడు మళ్ళీ ఉల్లి వంతు వచ్చింది. భారీగా పెరిగిన ఉల్లి ధరలతో సామాన్యుడు కొయ్యకుండానే కన్నీళ్లు పెట్టిస్తుంది.

సాధారణంగా మనం తినే ప్రతి కూరలో ఉల్లిగడ్డ ప్రాధాన్యం మన కూరల్లో ఉల్లి కి ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి ఉల్లి ధర మరోసారి కొండెక్కింది. సామాన్య గృహిణిలకు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది.

*ప్రస్తుతం కిలో సెంచరీ వైపు రూ.100 వైపు పరుగులు పెడుతోంది*


రిటైల్‌ మార్కెట్‌లో బుధవారం సాయంత్రం నాటికి నాణ్యత కలిగిన తెల్ల ఉల్లి గడ్డ ధర కిలో.రూ.85-90 వరకు పలికింది. ఇక ఎర్ర ఉల్లి గడ్డ ధర కిలో రూ.70-80 మద్య పలుకుతోంది.

మహారాష్ట్ర, కర్ణాటకలో ఉల్లిని అధికంగా పండిస్తుండగా.. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది.

ఈ ఏడాది వర్షాలతో పంట నష్టం ఏర్పడటం, కొత్త పంట దిగుబడులు మార్కెట్‌కు రాకపోగా..పాత నిల్వలు తగ్గడంతో ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక సెప్టెంబరు మొదటి వారంలో కిలో రూ.30 ఉండగా రెండు నెలల్లో అమాంతం పెరిగింది. మార్కెట్‌లో ఉల్లి ధర రోజు రోజుకు పెరిగి పోతుం డటంతో కొనలేక, తినలేక దాని వాడకాన్ని తగ్గించుకునే పరిస్థితి ఏర్పడింది.

కొన్ని హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్‌ స్టాల్స్‌లో నో ఆనియన్ బోర్డులు పెడుతున్నారు. ఉల్లి ధర తగ్గేవరకు కొనకపోవటం, తినక పోవటమే మంచిదనే అభిప్రాయానికి సామాన్యులు వస్తున్నారు.

నవంబరు నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుదని.ఆ తర్వాత ధరలు తగ్గే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు......

Post a Comment

Previous Post Next Post