తెలంగాణలో భాజపా రాజ్యం తీసుకురావాలి: అమిత్‌ షా..

ఆదిలాబాద్, 10 అక్టోబర్ (జనవిజన్ న్యూస్): తెలంగాణలో భాజపా రాజ్యం తీసుకురావాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లో మంగళవారం నిర్వహించిన భాజపా జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు..

కుమురం భీంను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభించిన అమిత్‌ షా.. పవిత్ర భూమి ఆదిలాబాద్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలో తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పడుతుంది. డిసెంబరు 3న హైదరాబాద్‌లో భాజపా జెండా ఎగరాలి. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్‌ వైఖరి కారణంగా గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైంది. గిరిజన వర్సిటీకి కేసీఆర్‌ సర్కారు జాగా చూపించలేదు.. ఆందుకే ఆలస్యమైంది. మోదీ.. కృష్ణా ట్రైబ్యునల్‌ నిబంధనలు మార్చి తెలంగాణకు నీటి ఇబ్బంది లేకుండా చేశారు. పదేళ్లుగా కేసీఆర్‌ తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదు. కేసీఆర్‌.. రైతులు, దళితులు, గిరిజనులను పట్టించుకోలేదు. మోదీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించింది'' అని అమిత్‌ షా తెలిపారు.

Post a Comment

Previous Post Next Post